• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికల కమీషన్‌పపై హైకోర్టు తీవ్ర మండిపాటు

By Staff
|
హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమీషన్‌పై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకాశం జిల్లాలోని చింతలపాలెం గ్రామంలో ఓట్ల గల్లంతుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్నికల కమీషన్‌కు హైకోర్టు అక్షింతలు వేసింది. ఎన్నికల కమీషన్‌ కార్యదర్శి జి. నారాయణరావు వారంట్లు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి సింఘ్వీ, జస్టిస్‌ సీతాపతిలతో కూడిన బెంచ్‌ హెచ్చరించింది. దీంతో నారాయణరావు హడావిడిగా కోర్టుకు హాజరయ్యారు.

చింతలపాలెం గ్రామంలో దాదాపు 275 ఓట్ల గల్లంతుపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం ఉదయం హైకోర్టు విచారణ ప్రారంభించింది. అయితే ఎన్నికల కమీషన్‌ కార్యదర్శి జి. నారాయణరావు హాజరు కాలేదు. దీంతో విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అప్పుడు కూడా నారాయణరావు రాలేదు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారంట్లు జారీ చేస్తామని హెచ్చరించింది. అయితే తనకు కాస్తా సమయం ఇవ్వాలని కమీషన్‌ తరఫు న్యాయవాది కోరారు. దీంతో హడావిడిగా నారాయణరావు కోర్టుకు హాజరై క్షమాపణలు వేడుకున్నారు. చింతలపాలెం గ్రామంలో ఓట్ల గల్లంతుపై పిటిషన్‌ పెట్టుకున్నవారి సమస్యను సోమవారం లోగా పరిష్కరిస్తామని నారాయణ రావు హైకోర్టుకు హామీ ఇచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more