వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోమాజీగూడలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని సోమాజీగూడా రాజీవ్సర్కిల్లో ఉన్న అమృతా ప్లాజాలో శనివారం ఉదయం పది గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్తులో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సాఫ్ట్వేర్ సంస్ధలోని కంప్యూటర్లు, ఇతర విలువైన పరికరాలు కాలిపోయాయి. కిటీకీల్లోంచి పొగలు రావడంతో అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. వారు సకాలానికి వచ్చి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్ వరకు రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.
Comments
Story first published: Saturday, July 22, 2006, 23:53 [IST]