వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్‌ బూటకం కాదు: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నల్లమల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకం కాదని హోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టం చేశారు. కొందరు వ్యతిరేక భావన కలిగినవారు బూటకమనే మాటలు మాట్లాడుతారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పూర్తి సమాచారం అందిన తర్వాత ఏ విషయమూ స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.

ఏ మాత్రం అవకాశం ఉన్నా అరెస్టు చేయడమే తమ ఉద్దేశం గానీ చంపడం లక్ష్యం కాదని ఆయన అన్నారు. హింస వుండకూడదని ప్రజలు అభిలషిస్తున్నారని, మీడియా కూడా అభిలషిస్తోందని అనుకుంటున్నానని ఆయన అన్నారు. నల్లమల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తనకు ఇంకా అందలేదని, ఎవరెవరు చనిపోయారనే వివరాలు కూడా అందలేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X