• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముఖ్యమంత్రి వైయస్‌కు పిజెఆర్‌ లేఖాస్త్రం

By Staff
|

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్‌ సీనియర్‌ శాసనసభ్యుడు పి. జనార్దన్‌ రెడ్డి లేఖాస్త్రం సంధించారు. హైదరాబాద్‌ పరిసరాల్లో భూముల వేలంపై నిరసన వ్యక్తం చేస్తూ, ఇతర ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ ఆయన ఆదివారంనాడు ఈ లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ లేఖను మీడియాకు విడుదల చేసిన పిజెఆర్‌ మీడియాతో మాట్లాడడానికి మాత్రం నిరాకరించారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని భూములను రైతుల నుంచి స్వాధీనం చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పగిస్తున్న ప్రభుత్వ విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని ఆయన అన్నారు.

రైతుల భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి తగిన ధర చెల్లించాలని లేదా అంతే విలువ చేసే భూములను ఇవ్వాలని ఆయన అన్నారు. రాయలసీమలో చేపడుతున్న హింద్రీ నీవా, గాలేరు నగరి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వంటి ప్రాజెక్టులను కృష్ణా మిగులు జలాల మీద ఆధారపడి మాత్రమే చేపట్టామని చెప్పినప్పటికీ హామీ జలాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తోందని, దీనివల్ల తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆ లేఖలో వివరించారు. వెంటనే తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ (టిఆర్‌సిసిసి) సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలకు మంచినీరు అందించే పథకంలో కూడా మార్పులు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X