వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానా రాజీనామాకు నరేంద్ర డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హోం మంత్రి కె. జానారెడ్డి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర డిమాండ్‌ చేశారు. ఘోరమైన ఎన్‌కౌంటర్‌ జరిగితే జానారెడ్డి సినిమాలకు, షికార్లకు వెళ్తారా? అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంత మందిని చంపుతారు, ఎంత రక్తపాతం సృష్టిస్తారు? అని ఆయన అడిగారు.

ఎన్‌కౌంటర్‌ జరిగిందని తెలిసినా జానారెడ్డి సినిమాకు వెళ్లడం నీరో చక్రవర్తిలాగా ప్రవర్తించడమేనని ఆయన అన్నారు. నల్లమల ఎన్‌కౌంటర్‌తో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన అన్నారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే జానారెడ్డి ఆ సమావేశానికి హాజరు కాకపోవడం క్షమించరానిదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X