వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేలం వెర్రి కాదు, వనరుల సమీకరణకే: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసమే భూములను వేలం వేస్తున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి చెప్పారు. అదనపు పన్నులు వేయకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఆదాయ వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. భూములను పారదర్శక పద్ధతిలో వేలం వేయడం ఆమోదయోగ్యమేనని ఆయన అన్నారు. నిరుపయోగమైన భూములను, నిరర్థక ఆస్తులను విక్రయించడం ద్వారా, పెట్టుబడులను ఉపసంహరించడ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా జరిగిందని, తమది కొత్త పద్ధతేమీ కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ విధంగా జరిగిన భూ విక్రయాల వివరాలను ఆయన ఉదహరించారు. తమది వేలం వెర్రి ఏమీ కాదని ఆయన అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల బాధ్యత నుంచి తాము తప్పుకోవాలని అనుకోవడం లేదని, అందుకే భూములను వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకుని వాటికి ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు. హుడా ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎక్స్‌ప్రెస్‌ హైవే వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని, వాటికి నిధులు అవసరమని, అందుకు భూములను వేలం వేయడం తప్పదని ఆయన అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ భూములను కాపాడడం కూడా కష్టమని, ఈ భూములు ఒకసారి వేరే వారి చేతుల్లోకి వెళ్లిన తర్వాత తిరిగి స్వాధీనం చేసుకోవడం కూడా కష్టమని, వేలాది కోట్ల రూపాయల విలువ చేసే ఎకరాల కొద్దీ భూకబ్జా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో వున్నాయని ఆయన అన్నారు. బడ్జెట్‌లో కేటాయించని ఖర్చులు విపరీతంగా ఉంటాయని, అందుకు కూడా నిధులు సమకూర్చుకోవాల్సి వుంటుందని ఆయన అన్నారు. చట్టబద్దంగా, న్యాయబద్దంగా కార్యక్రమాలు చేయమని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. భూసేకరణ జరపకుండా ప్రాజెక్టులు చేపట్టడం సాధ్యం కాదని, తాము నిర్వాసితులకు మేలు జరిగే విధంగా నష్టపరిహారం చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. భూసేకరణకు కొత్త పద్ధతి అవలంబిస్తున్నామని ఆయన చెప్పారు.

విమర్శలు చేయడానికి అవకాశం లేక ప్రతిపక్షాలు చాలా చిన్న విషయాన్ని కూడా పెద్దవి చేసి విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. తాము ప్రతి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. హుడా వేలం పాట పద్ధతులపై హర్షం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్‌ అమలుకు, జలయజ్ఞానికి, తదితర కార్యక్రమాలకు నిధులు అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రం ప్రగతి పథంలోకి దూసుకెళ్తోందని, దీన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. చిత్తశుద్ధితో తాము పనులు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇంత పెద్ద యెత్తున కార్యక్రమాలు జరుగుతాయని ఎవరూ ఊహించలేదని ఆయన అన్నారు. ప్రజలు తమ విధానాలను బలపరుస్తున్నారని, మున్సిపల్‌, స్థానిక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X