• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గన్యా నివారణకు ఉమ్మడి చర్యలు: రోశయ్య

By Staff
|

బెంగుళూర్‌: చికన్‌గన్యా నివారణకు పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలను చేపడుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్య చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల సంయుక్త సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఆదివారం ఇక్కడికి వచ్చారు. పొరుగు రాష్ట్రాలతో అభిప్రాయాలను పంచుకుని చికన్‌ గన్యా నివారణకు ఉమ్మడి కార్యక్రమాలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఇతర రాష్ట్రాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మన రాష్ట్రంలో చికన్‌ గన్యా నివారణకు తీసుకుంటున్న చర్యల్లో లోపాలుంటే సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు. చికన్‌ గున్యా వ్యాధి విపరీతంగా విస్తరిస్తూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X