వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

610 జీవో అమలుకు ముఖ్యమంత్రి ఆదేశం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే 610 జీవోను కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. 610 జీవో అమలుపై ఆయన సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. 610 జీవోను అమలు చేయాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని శాఖలు శ్రద్ధ చూపకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

610 జీవో అమలుపై శాఖలవారీగా నివేదికలు రూపొందించి సమర్పించాలని కూడా ఆయన ఆదేశించారు. 610 జీవో అమలుపై వచ్చే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తే అవకాశం ఉండడంతో ఆయన సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. 610 జీవోను అమలు చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున దాని అమలులో ఏ విధమైన న్యాయపరమైన చిక్కులు ఎదురు కాబోవని ముఖ్యమంత్రి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X