• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంతటి విపత్తులో పొరపాట్లు సహజం: వైయస్‌

By Staff
|

హైదరాబాద్‌: ఇంత పెద్ద యెత్తున విపత్తు సంభవించినప్పుడు పొరపాట్లు జరగడం సహజమేనని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లే ముందు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సహాయ కార్యక్రమాల్లో చిన్న చిన్న లోపాలు జరిగిన మాట వాస్తవమేనని, మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా వ్యవహరించిందని ఆయన అన్నారు.

వరద నష్టంపై త్వరలో ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పూర్తి స్థాయి నివేదికను అందిస్తామని ఆయన చెప్పారు. వరద బాధితులకు సహాయాన్ని తగ్గించవద్దని ఆయన అధికారులను ఆదేశించారు. వరదలు ఇంత పెద్ద యెత్తున వస్తాయని ఊహించలేదని, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పడవలను సిద్ధంగా వుంచామని, అయితే వరదలు వస్తే పక్కన గుట్టలమీదనో, మరెక్కడో తల దాచుకుంటామని ప్రజలు చెప్పారని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం కేంద్రం నుంచి ఐదు హెలికాప్టర్లు వచ్చాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X