• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోక్‌సత్తా పేరుతోనే రాజకీయ పార్టీ: జయప్రకాశ్‌

By Staff
|

హైదరాబాద్‌: తమ రాజకీయ పార్టీ అక్టోబర్‌ 1వ తేదీన ప్రారంభమవుతుందని లోక్‌సత్తా సమన్వయకర్త జయప్రకాశ్‌ నారాయణ చెప్పారు. లోక్‌సత్తా పేరుతోనే రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. నూతన రాజకీయ సంస్కృతి తమ రాజకీయ పార్టీ లక్ష్యమని ఆయన చెప్పారు. తాము చేపట్టిన సర్వేలో నూతన రాజకీయ పార్టీ అవసరమని 90 శాతం మంది అభిప్రాయపడ్డారని, ఆ అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీని స్థాపిస్తున్నామని ఆయన వివరించారు.

పార్టీని ప్రారంభించేలోగా జిల్లాలవారీగా సన్నాహక సదస్సులు, సభ్యులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తమ పార్టీలో యువతకు, బలహీనవర్గాలవారికి, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. పార్టీ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలు తొలగించే దిశలో తమ పార్టీ పని చేస్తుందని ఆయన చెప్పారు. చట్టబద్దంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నష్టమేమీ లేదని, అయితే రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఆ ప్రాంత ప్రజల సమస్యలు తీరబోవని జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. స్థూలంగా చూస్తే తెలుగుదేశం, కాంగ్రెస్‌ల మధ్య తేడా ఏమీ లేదని, ఆటగాళ్ల ముఖాలు మారుతున్నాయంతేనని ఆయన అన్నారు. తమ పార్టీ ఆర్భాటాలకు తావు వుండదని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X