• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

72 నెంబర్‌ జీవోను రద్దు చేయాలి: పిజెఆర్‌

By Staff
|
హైదరాబాద్‌: ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవోను సమీక్షించడానికి జారీ చేసిన 72 నెంబర్‌ జీవోను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ శాసనసభ్యుడు పి. జనార్దన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 610 జీవోను యధాతధంగా వెంటనే అమలు చేయడం మంచిదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జీవో నెంబరు 72ను తెలంగాణ శాసనసభ్యులందరూ వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.

610 జీవో అమలు అనేది కేవలం నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు సంబంధించిన అంశమని, దాన్ని అమలు చేయకపోవడం వల్ల అనేక అనుమానాలు తలెత్తి మిగతా రంగాల్లోని వారిలో కూడా ఆందోళనకు గురి చేస్తుందని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని భూముల వేలం పాటలపై శాసనసభ సమావేశాలకు ముందుకు జరిగే కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సియల్‌పి) సమావేశంలో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారాలు నడిపిన కోనేరు ప్రసాదే ఇప్పుడు కూడా ఆ వ్యవహారాలు నడుపుతున్నారని ఆయన అన్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు భూములను సేకరించి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా రైతులకు నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more