• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముగ్గురి మహారాష్ట్రుల మృతదేహాలు లభ్యం

By Staff
|

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని పెన్‌గంగ వరదల్లో చిక్కుకుని గల్లంతైన ఐదుగురు మహారాష్ట్రకు చెందినవారిలో ముగ్గురి శవాలు లభ్యమయ్యాయి. పెన్‌గంగ వరదల్లో క్వాలిస్‌ వాహనం చిక్కుకుపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురిని బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బుధవారంనాడు వరద తగ్గుముఖం పట్టడంతో వాహనం బయటకు తేలింది. అయితే అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి ఆచూకీ తెలియలేదు.

గల్లంతైన ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ముగ్గురి శవాలు ముకుడ్‌బన్‌ గ్రామం వద్ద కనిపించాయి. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు మహారాష్ట్రకు వెళ్తుండగా వాహనం పెన్‌గంగ వరదల్లో మునిగిపోయింది. మిగతా ఇద్దరు కూడా చనిపోయి వుంటారని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X