వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో విమానాన్ని పేల్చివేసే ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దాదాపు 20 మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనే ఇంటలిజెన్స్‌ సమాచారంతో బ్రిటన్‌లోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. అదనపు భద్రతా చర్యలను చేపట్టారు.

పేలుడు యంత్రాలను ఎయిర్‌క్రాఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాగేజీకి చేర్చి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి అమెరికాకు వెళ్లే విమానాలపై దాడి చేయాలనేది ఉగ్రవాదుల కుట్ర అని స్కాట్లాండ్‌ యార్డ్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. లండన్‌లో హిత్రే విమానాశ్రయంలో ఉగ్రవాదులను అరెస్టు చేశారు. దీంతో విమానాల రాకపోకల్లో జాప్యం జరిగింది. సాధ్యమైనంత తక్కువ లగేజీతో రావాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X