• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక కృష్ణానది వంతు: పొంచివున్న ముప్పు

By Staff
|

విజయవాడ: కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం సాధారణ స్థాయికి మించి పెరిగే ప్రమాదం వుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 7.5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం వుంది. ప్రస్తుతం 3.97 లక్షల క్యూసెక్కులు ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కృష్ణలంకలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం వుందని భావిస్తున్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీమా ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీమా, తుంగభద్ర నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కృష్ణానదిలో కూడా ప్రవాహం పెరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X