• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరణ్‌సింగ్‌పై పుస్తకాన్ని ఆవిష్కరించిన వైయస్‌

By Staff
|

హైదరాబాద్‌: కాశ్మీర్‌కు చెందిన జాతీయ నాయకుడు కరణ్‌ సింగ్‌ జీవిత విశేషాల తెలుగు అనువాదం పుస్తకాన్ని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి ఆదివారంనాడు ఆవిష్కరించారు. దీనిలో కరణ్‌సింగ్‌ తొలి 36 ఏళ్ల జీవిత విశేషాలున్నాయి. ఈ పుస్తకాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలుగులోకి అనువదించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణ రావు, మాజీ గవర్నర్‌ వి.యస్‌. రమాదేవి, జస్టిస్‌ రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంటు ప్రవర్తనానియమావళిని అందరూ పాటించాలని, పార్లమెంటు గౌరవాన్ని కాపాడాలని కరణ్‌సింగ్‌ ఈ సందర్భంగా అన్నారు. పార్లమెంటులో పలు అంశాలపై చర్చ జరపవచ్చునని, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చునని, అయితే సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X