వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్నారైల ఫోరం కృషి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి పాలమూరు ఎన్‌.ఆర్‌.ఐ. ఫోరమ్‌ నడుం బిగించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మోడల్‌ స్కూల్‌ పేరిట ప్రారంభమైన ఈ ప్రాజెక్టును ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఉషారాణి ఆష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రాజెక్టు కార్య నిర్వహ కుడు రవి మేరెడ్డి (ఫిల్లీ యు.ఎస్‌.ఎ), ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి. డైరక్టర్‌ శ్రీమతి సావిత్రి పాల్గొన్నారు. ఆమె చేసిన ప్రసంగం ఆహూతులను ఉత్తేజితులను చేసింది. ఇదిలా ఉంటే జిల్లాలో ఈ ప్రాజెక్టుకు రామ్‌ బరిగెల్లా పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తారు.

ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓ ఉన్నతమైన ఆశయంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రధానోద్దేశం గుర్తింపుతో కూడిన ప్రేరణ తీసుకురావడమే. మనిషిని నడిపించడంలో గుర్తింపు అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మనం తగిన రీతిలో మనుషులను గుర్తించినట్లయితే, వారి పనితనం మెరుగుపడుతుంది. అలాగే చిన్న ప్రోత్సాహాన్ని అందించినా అది పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపుతుందని, పిల్లలో ఉన్న శక్తిని గుర్తించడంలో స్కూళ్ళు విఫలమవుతున్నాయి. అయితే వారిలో గొప్ప ప్రతిభా పాటవాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందేనని చెప్పారు. కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతిపాదిత స్కూల్‌కి ఐదు వందల డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా. యాభై విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని ఆయన తెలియజేశారు. ఇతర సూళ్ళు అనుసరించే విధంగా ఈ స్కూళ్ళను ఎలా అభివృద్ధి పరుస్తామో తెలిపే ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరుగుతుందని. విద్యా సంవత్సరం అంతమయ్యే నాటికి మద్దతు దారులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు తదితరులు గుర్తించే విధంగా మా ఎన్‌.ఆర్‌.ఐ. ఫోరమ్‌ పెద్ద అభినందన కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే ప్రతి స్కూల్‌ ఈ స్కూల్‌ మోడల్‌ స్కూల్‌ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యమైనది. దీనికి మద్దతు ఫలానా అనే బోర్డును విద్యా సంవత్సరమంతా ప్రదర్శిస్తుంది. పాలమూరు సంస్థ ఎంపికైన స్కూల్‌తో కలిసి పనిచేస్తూ, మోడల్‌ స్కూల్‌గా గుర్తింపు సాధించడానికి కృషి చేస్తుంది. అలాగే జిల్లా పాలనా యంత్రాంగం, ఎన్‌.ఆర్‌.ఐల ఫోరమ్‌తో సంబంధాలు నెరపుతూ విద్యా ప్రమాణాలు మెరుగు పరుస్తూ, నాణ్యమైన విద్యను అందించడానికి సంస్థ కృషి చేస్తుంది. అయితే నిర్వహణా సామాగ్రిని సమకూర్చుకోవడంలో సంస్థ ఎటువంటి సహాయం అందించదు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ నడుపుతున్న కార్యక్రమాలకు ఇది పునః ప్రారంభం కాదు కాని వాటికి జీవం పోయడానికి ఉద్దేశించిందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X