• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాభదాయక జోడు పదవుల బిల్లుపై జెపిసి

By Staff
|

న్యూఢిల్లీ: లాభదాయక జోడు పదవుల బిల్లుపై పరిశీలనకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలియజేసింది. బిల్లుకు సంబంధించి రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అంశాలను కమిటీ పరిశీలించి నివేదిక సమర్పిస్తుంది. సందేహాలను వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ బిల్లును వెనక్కి పంపారు.

సంయుక్త పార్లమెంటరీ కమిటీలో పదిహేను మంది సభ్యులుంటారని, ఇందులో 10 మంది లోక్‌సభ నుంచి వుంటారని, కమిటీ చైర్మన్‌ పేరుతో పాటు మిగతా సభ్యుల పేర్లను లోక్‌సభ స్పీకర్‌ ప్రకటిస్తారని, ఐదుగురు సభ్యులు రాజ్యసభ నుంచి వుంటారని, వీరి పేర్లను రాజ్యసభ చైర్మన్‌ ప్రకటిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌. ఆర్‌. భరద్వాజ మీడియా ప్రతినిధులతో చెప్పారు. జెపిసి తన నివేదికను శీతకాలం సమావేశాల చివరి వారం మొదటి రోజు లోక్‌సభకు సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X