• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

By Staff
|

తిరుపతి: చిత్తూరు జిల్లా వడమాల పేట వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన మూడు కుటుంబాల వారు తిరుమలేశుని దర్శనార్థం బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తమిళనాడుకు చెందిన వీరు ప్రయాణిస్తున్న బస్సును తిరుపతి వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఆర్టీసి బస్సులో వారు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసి బస్సు పూర్తిగా ధ్వంసమైంది.

మృతులు తమిళనాడులోని చెన్నైకి సమీపంలో గల పొరూరు గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. మరణించినవారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురున్నారు. గాయపడినవారిని తిరుపతిలోని రుయా అస్పత్రికి తరలించారు. స్థానిక శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రమాద స్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాద స్థలం వద్ద హృదయ విదారకంగా వుంది. సంవత్సరంలోపు వయస్సున్న ఇద్దరు మృతుల్లో వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X