వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే వెంకటరెడ్డి వివరణ అడుగుతాం: కెకె

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌పై దాడికి దిగారనే ఆరోపణ విషయంలో సుజాతనగర్‌ పార్టీ శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి తీరును ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు తప్పు పట్టారు. వెంకటరెడ్డి నుంచి వివరణ కోరుతామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వెంకటరెడ్డి తీరు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే సంఘటన అని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారులు స్వేచ్ఛగా తమ విధులను నిర్వహించుకునేందుకు వీలు కల్పించాలని, అధికారుల విధుల నిర్వహణను అడ్డుకునే ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని ఆయన అన్నారు. పని చేయండని అధికారులను ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని, అలాగే అధికారులు ప్రజాప్రతినిధులను గౌరవించాలని ఆయన అన్నారు. విభేదాలు వస్తే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలే గాని ఘర్షణలకు దిగకూడదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X