• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుండాగిరికి వైయస్‌ లైసెన్సులు: చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభ్యులకు, మంత్రులకు ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి గుండాగిరి లైసెన్సులు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అక్రమాలు, దౌర్జన్యాలను చేసే కాంగ్రెస్‌ శాసనసభ్యులను, మంత్రులను వైయస్‌ ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. వరదలపై శాసనసభలో జరిగిన చర్చకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం తీరుపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.

వరద బాధితులకు తగిన సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ శాసనసభ వెలుపల ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన చెప్పారు. కడప మేయర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డిపై కేసు నమోదైతే అరెస్టులు కూడా జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో యస్పీ ఆర్‌.కె. మీనాపై సుజాతనగర్‌ శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి దాడికి దిగారనే సంఘటనను ఆయన ప్రస్తావించారు. శాంతిభద్రతల పరిస్థితి ఎటు పోతోందని ఆయన అడిగారు. గ్యాస్‌ ఏజెన్సీ కోసం బెదిరింపులు చేసిన మంత్రి కోనేరు రంగారావుపై చర్య తీసుకునే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో మంత్రులు తమను తిడుతుంటే ముఖ్యమంత్రి నవ్వుతూ కూర్చున్నారని, ముఖ్యమంత్రి వ్రపర్తన ఏ మాత్రం బాగా లేదని ఆయన అన్నారు. వరద సాయంపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని తెలుగుదేశం పార్టీ అంతకు ముందు శాసనసభ నుంచి వాకౌట్‌ చేసింది. వరద సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు శాసనసభలో విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X