• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధాని చేతికి కెసిఆర్‌, నరేంద్ర రాజీనామా లేఖలు

By Staff
|
న్యూఢిల్లీ: మంత్రి పదవులకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేతలు కె. చంద్రశేఖరరావు, ఎ. నరేంద్ర రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను వారు ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు మంగళవారం సాయంత్రం సమర్పించారు. రాజీనామా లేఖలను తీసుకుని వారు ప్రైవేట్‌ కారులో మన్మోహన్‌ నివాసానికి వెళ్లారు. రాజీనామా లేఖలను వారు సోమవారంనాడే సిద్ధం చేసుకున్నారు. ప్రధాని నివాసానికి బయలుదేరే ముందు ఆ రాజీనామా లేఖలను పార్టీ లెటర్‌ హెడ్‌పై టైప్‌ చేయించి తీసికెళ్లారు.

వామపక్షాలతో సమావేశమైన తర్వాత చంద్రశేఖరరావు తన నివాసానికి వచ్చారు. వెంటనే పార్టీ శాసనసభ్యులతో, పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలను ఆయన సమావేశంలో వివరించారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌, మరో మేధావి ఆర్‌ విద్యాసాగరరావులతో చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాజీనామా లేఖలతో వారు ప్రధాని నివాసానికి బయలుదేరారు. వారు ప్రధానికి నేరుగా రాజీనామా లేఖలు సమర్పించకుండా తమ వ్యక్తిగత కార్యదర్శులతో పంపించారు. ఆ తర్వాత ఇద్దరు అగ్రనేతలు ఒక రహస్య ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. చంద్రశేఖరరావు నివాసం వద్ద తెలంగాణ నినాదాలు మార్మోమ్రోగాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కెసిఆర్‌ జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్షను ప్రారంభిస్తారు. ఢిల్లీలో వున్న తెరాస శాసనసభ్యులు ఈ రాత్రికి హైదరాబాద్‌ తిరిగి వస్తున్నారు. రేపు (బుధవారం) శాసనసభా సమావేశాలను స్తంభింపజేయాలని శాపనపభ్యులు నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి తెరాస నాయకులు, కార్యకర్తలు జిల్లాల్లో ఆందోళనలు కూడా చేస్తారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more