• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వేరే దేహానికి నా ముఖం అతికించారు: కుష్బూ

By Staff
|

హైదరాబాద్‌: వేరే స్త్రీ దేహానికి తన ముఖం అతికించి మాగ్జిమ్‌ పత్రిక అర్థనగ్న శరీరాలను ప్రచురించిందని సినీనటి కుష్బూ అన్నారు. ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆమె బుధవారం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మాగ్జిమ్‌ పత్రికపై తాను చేస్తున్న పోరాటం మిగతా మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. మాగ్జిమ్‌ పత్రిక ఎడిటర్‌ సునీల్‌ మెహతా సహా ఐదుగురిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు.

మాగ్జిమ్‌ పత్రికపై కుష్బూ పరువు నష్టం దావా కూడా వేశారు. మాగ్జిమ్‌ పత్రికపై కేవలం తన కోసమే తాను పోరాటం చేయడం లేదని, ఈ వ్యవహారంలో తాను గెలిస్తే మిగతా మహిళలకు మేలు జరుగుతుందని, ముఖ్యంగా సినిమాల్లో నటించే స్త్రీలపై చిన్న చూపు వుంటుందని, తాను విజయం సాధిస్తే అది కొంత మేరకు తగ్గే అవకాశం వుంటుందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X