• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోక్‌సభలో బీహార్‌ మార్కు అసభ్య ప్రవర్తన

By Staff
|

న్యూఢిల్లీ: బీహార్‌ శాంతిభద్రతల పరిస్థితిపై చర్చ సందర్భంగా గురువారం లోక్‌సభలో దిగ్భ్రాంతికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) సభ్యుడు, కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బావ మరిది సాధూ యాదవ్‌ జెడి - యు సభ్యుడు ప్రభునాథ్‌ సింగ్‌ను కొట్టడానికి లంఘించారు. కొందరు ఆర్‌జెడి సభ్యులు బల్లలపై చేతులో గట్టిగా కొట్టారు. పత్రాలను చింపి విసిరివేశారు. మైక్‌ బాక్స్‌ను విరగగొట్టారు. లోక్‌సభ అర్థాంతరంగా వాయిదా పడిన కొద్ది నిమిషాల్లో ఈ అసభ్యకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభునాథ్‌ సింగ్‌ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ తిరస్కరించారు. తమ సభ్యుల వ్రపర్తనకు ఆర్‌జెడి నేత, కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ క్షమాపణ చెప్పారు.

బీహార్‌ వ్యవహారాల్లో కొందరు కేంద్ర మంత్రుల జోక్యంపై ప్రభునాథ్‌ సింగ్‌ కొన్ని రాజ్యాంగవిరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం ఆ పరిస్థితికి దారి తీసింది. ప్రభునాథ్‌ సింగ్‌ చేసిన కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలను స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ రికార్డుల నుంచి తొలగించారు. ప్రభునాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన ఆర్‌జెడి సభ్యులు వెల్‌వైపు దూసుకెళ్లారు. ఈ సమయంలో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. ఒక సందర్భంలో సాధూ యాదవ్‌, ప్రభునాథ్‌ సింగ్‌ ఎదురెదురు నిలబడి ఆగ్రహంగా వ్యాఖ్యలు చేసుకున్నారు. ఈ సమయంలో సాధుయాదవ్‌ ప్రభునాథ్‌ సింగ్‌ను పిడికిలి బిగించి కొట్టబోయారు. సాధూ యాదవ్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ, ఇతర సభ్యులు వెనక్కి లాగారు. అదే సమయంలో సాధూ యాదవ్‌ను తిప్పికొట్టడానికి ప్రభునాథ్‌సింగ్‌ కూడా పిడికిలి బిగించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి హౌస్‌ మార్షల్స్‌, వాచ్‌ అండ్‌ వార్డు సిబ్బంది రంగంలోకి దిగారు. ఆర్‌జెడి సభ్యుడొకరు రిపోర్టర్ల మైక్‌ బాక్స్‌ను పట్టుకుని బిజెపి సభ్యుల వైపు విసిరికొట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X