• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రామాలు ఆపి తెలంగాణపై చర్చించండి: టిడిపి, సిపియం

By Staff
|

హైదరాబాద్‌: శాసనసభలో కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల తీరుపై తెలుగుదేశం, సిపియం తీవ్రంగా ధ్వజమెత్తాయి. తెలంగాణపై చర్చకు అనుమతించాల్సిన అవసరం వుందని ఆ రెండు పార్టీలు కూడా అభిప్రాయపడ్డాయి. పలు సమస్యలు చర్చకు రాకుండా చేయడానికే కాంగ్రెస్‌ వ్యూహం పన్నిందని, ఆ వ్యూహానికి తెరాస శాసనసభ్యులు ఉపయోగపడుతున్నారని సిపియం శాసనసభ్యుడు తమ్మినేని వీరభద్రం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమను ఇరుకున పెట్టే అంశాలు చర్చకు రాకుండా చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ నాటకం ఆడుతోందని ఆయన అన్నారు. తెరాస సభ్యులకు లేవనెత్తుతున్న అంశం తెలంగాణ ప్రజల సెంటిమెంటుకు సంబంధించిందని, దానిపై చర్చ చేపట్టాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.

తెలంగాణ అంశంపై చర్చ ప్రారంభించాల్సిన అవసరం వుందని తెలుగుదేశం శాసనసభా పక్ష ఉపనాయకుడు డాక్టర్‌ నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. తెరాస, కాంగ్రెస్‌లు ఎందుకు కలిసి పోటీ చేశాయి, ఎందుకు విడిపోయాయి అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నడుపుతున్న నాటకానికి తెర దించి తెలంగాణపై చర్చకు ముందుకు రావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెరాస కార్యకర్తలది పిరికిపందల చర్య అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X