వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్ల్యుటిఎ ర్యాంకింగ్‌లో దిగజారిన సానియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా డబ్ల్యుటిఎ ర్యాంకింగ్‌లో గణనీయంగా దిగజారింది. గతంలో యాబై లోపు ర్యాంక్‌ను సాధించి సంచలనం సృష్టించిన సానియా ర్యాంక్‌ ఇప్పుడు 50పైకి చేరుకుంది. టెన్నిస్‌ సింగిల్స్‌లో సానియా ఆటతీరు రోజు రోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం సానియా ర్యాంక్‌ 54 వుంది. సోమవారం విడుదల చేసిన డబ్ల్యుటిఎ ర్యాంకింగ్‌లో ఆమె పది పాయింట్లు కోల్పోయింది. డబుల్స్‌ ర్యాంకింగ్‌లో మాత్రం 28వ స్థానంలో వుంది.

భారతీయుల్లో అమెరికాలో నివసిస్తున్న శిఖా ఒబెరాయ్‌ రెండు స్థానాలు ఎగబాకింది. ఆమె ప్రస్తుతం 191 స్థానంలో వుంది. అంకితా బాబ్రికి 362 ర్యాంక్‌ లభించింది. ఇషా లఖానీకి 382వ ర్యాంక్‌ లభించింది. సానియా ఇటీవలి కాలంలో సింగిల్స్‌ పోటీల్లో గత ప్రతిభను ప్రదర్శించలేకపోతోంది. దీంతో ఆమె ర్యాంక్‌ క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X