• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

By Staff
|

నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వీరంతా రాజమండ్రికి చెందినవారు. రాజమండ్రి నుంచి స్కార్పియోలో హైదరాబాద్‌లో పెళ్లికి హాజరు కావడానికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇదే సమయంలో వారు తమ నివాసాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మార్చడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి బస్సులు దొరకకపోవడంతో స్కార్పియో మాట్లాడుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. స్కార్పియో వెనక వారి కుటుంబానికి చెందిన సామానుతో లారీ కూడా వస్తోంది.

ప్రమాదం సంభవించిన సమయంలో స్కార్పియోలో 12 మంది వున్నారు. స్కార్పియోను డ్రైవర్‌ ఒక వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీ నుంచి తప్పించబోయాడు. అయితే స్కార్పియో నేరుగా లారీకి ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పసిపాప వున్నారు. ఈ సంఘటనతో విషాద వాతావరణం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X