వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుష్బూను చుట్టుకున్న మరో వివాదం
చెన్నై: సినీనటి కుష్బూ మరో వివాదంలో చిక్కుకుంది. పెరియార్ జీవితంపై నిర్మించే చిత్రంలో పాత్రను కుష్బూకు ఇవ్వడంపై పియంకె తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోంది. పెరియార్‌పై నిర్మించే చిత్రంలో కుష్బూను ఆయన రెండో భార్య మణియమ్మాళ్ పాత్రను పోషిస్తోంది. ఆమెకు ఈ పాత్ర ఇవ్వడంపై పియంకె సభ్యులు మంగళవారం శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసింది. పెళ్లికి ముందు సెక్స్‌ను సమర్థించి వివాదంలో చిక్కుకున్న కుష్బూ ఇప్పుడు తాజా వివాదంలో చిక్కుకుంది.
తమిళ సంప్రదాయాన్ని కించపరిచిన కుష్బూను తమిళులు ఇతోధికంగా గౌరవించే మణియమ్మాళ్ పాత్ర ఇవ్వడంపై పియంకె ప్రశ్నిస్తోంది. ఈ చిత్ర నిర్మాణానికి ప్రభుత్వం 95 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. విషయం కోర్టులో వున్నందున ఇప్పుడు తాము మాట్లాడడం సమంజసం కాదని చెప్పి ప్రభుత్వం తప్పించుకుంది.
Comments
Story first published: Tuesday, August 29, 2006, 23:53 [IST]