వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సంతతి టెక్నోలకు మైక్రోసాఫ్ట్‌ తాఖీదులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారత టెక్నోలకు మైక్రోసాఫ్ట్‌ మానవ వనరుల విభాగం తాఖీదులు జారీ చేసింది. అమెరికాలో, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో, ఇతర దేశాల్లో పని చేస్తున్న భారత సంతతికి చెందిన టెక్నోక్రాట్స్‌కు మార్గదర్శక సూత్రాలతో కూడిన మెమోను మైక్రోసాఫ్ట్‌ జారీ చేసింది. ఈ మెమోపై మైక్రోసాఫ్ట్‌ కార్పోరేషన్‌ మానవ వనరుల డైరెక్టర్‌ స్టీవ్‌ రైడర్‌ జారీ చేశారు. ఈ మెమోలో భారత సంతతికి చెందిన హిందీ మాట్లాడే టెక్నోక్రాట్లు పాటించాల్సిన ఏడు మార్గదర్శక సూత్రాలు వున్నాయి.

హిందీ భాష మాట్లాడే తమ ఉద్యోగులు ఇతరులను బాధపెట్టే భాష వాడుతున్నట్లు తమ కార్పోరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన పలువురు అధికారులు తమ దృష్టికి తెచ్చారని, ఆ విధమైన ప్రవర్తన తమ విధానాన్ని ఉల్లంఘించడమే కాకుండా వృత్తివ్యతిరేకమని, సందర్శకులనూ సహోద్యోగులను బాధపట్టడమేనని రైడర్‌ ఆ మెమోలో అన్నారు. కొన్ని హిందీ పదాల వాడకాన్ని విరమించుకోవాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. ఆ హిందీ పదాలను ఆయన వరుసగా క్రోడీకరించిన మార్గదర్శక సూత్రాలలో పొందుపరిచారు. అవన్నీ అసభ్యకరమైన పదాలే కావడం విశేషం. నిరసనను వ్యక్తం చేయడానికి, దూషించడానికి సాధారణంగా వాడే అసభ్యకరమైన పదాలు అవి. ఈ మెమో చదివిన తర్వాత అనకూడదని హిందీ వాక్యాన్ని కూడా ఆయన మెమోలో పొందుపరిచారు. ఈ మార్గదర్శక సూత్రాలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చివరగా పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X