వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జింక కేసులో సాక్ష్యం చూపండి: అమీర్‌ సవాల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తన చిత్రం లగాన్‌ షూటింగ్‌లో జింకను వాడినట్లు డాక్యుమెంటరీ సాక్ష్యం చూపాలని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ గుజరాత్‌ అటవీ శాఖను డిమాండ్‌ చేశారు. కచ్‌లో 2000లలో అమీర్‌ ఖాన్‌ లగాన్‌ షూటింగ్‌లో జింకను చట్టవిరుద్ధంగా వాడారని గుజరాత్‌ ప్రభుత్వ అటవీ శాఖ ఆగస్టు 7వ తేదీన నోటీసులు జారీ చేసింది.

వన్య ప్రాణి సంరక్షణ చట్టానికి ఉల్లంఘించినందుకు అమీర్‌ఖాన్‌కు గత నెల నోటీసులు జారీ చేశామని, వారంలోగా సమాధానం ఇవ్వాలని అమీర్‌ఖాన్‌కు సూచించామని, అయితే తాను చట్టాన్ని ఉల్లంఘించినట్లు డాక్యుమెంటరీ సాక్ష్యం చూపాలని అమీర్‌ఖాన్‌ తన న్యాయవాది ఆనంద్‌ దేశాయ్‌ ద్వారా లేఖ రాశారని కచ్‌ సర్కిల్‌ ఫారెస్టు కన్జర్వేటర్‌ ఆర్‌.యల్‌. మీనా వివరించారు. అటవీ శాఖ అనుమతి లేకుండా జింకను అమీర్‌ ఖాన్‌ లగాన్‌ షూటింగ్‌లో ఎలా వాడుకున్నాడనే విషయంపై అన్ని వివరాలను అందించామని మీనా చెప్పారు. కావాలని వివాదాన్ని పొడిగించాలని అమీర్‌ఖాన్‌ చూస్తున్నట్లున్నారని, తనకు అనుకూలంగా బలంగా వాదించుకోవడానికి అమీర్‌కు హక్కు వుందని, అయితే తమ వద్ద డాక్యుమెంటరీ సాక్ష్యం వుందని తాము ప్రభుత్వ న్యాయవాది సలహాను కోరామని, త్వరలోనే భవిష్యత్తు చర్యలను ఖరారు చేసుకుంటామని, న్యాయపోరాటం తప్పేట్లు లేదని మీనా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X