• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసు కస్టడీకి వెళ్లనన్న రాజన్న: నచ్చజెప్పిన బుర్రా

By Staff
|

వరంగల్‌: కరీంనగర్‌ పోలీసుల వెంట వెళ్లడానికి జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న వరంగల్‌ జైలులో నిరాకరించారు. న్యాయవాది, వైద్యుల సమక్షంలో విచారణ జరుపుతామని హామీ ఇస్తేనే తాను కరీంనగర్‌ పోలీసుల కస్టడీకి వెళ్తానని ఆయన పట్టుబట్టారు. దీంతో మానవ హక్కుల వేదిక నాయకుడు బుర్రా రాములు రప్పించి రాజన్నకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. న్యాయస్థానం అనుమతిస్తే న్యాయవాది, వైద్యుల సమక్షంలో విచారణ జరపడానికి తమకు అభ్యంతరం లేదని పోలీసులు చెప్పారు. ఎట్టకేలకు రాజన్నను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.

న్యాయవాది, వైద్యుల సమక్షంలో మాత్రమే పోలీసు విచారణ జరగాలని మెజిస్ట్రేట్‌ ముందు పిటిషన్‌ పెట్టుకోవాలని బుర్రా రాములు రాజన్నకు సూచించారు. దీంతో ఈ విషయమై పులి సత్యం అనే న్యాయవాదిని ఆయన నియమించుకున్నారు. న్యాయవాది సమక్షంలోనే రాజన్నను పోలీసులు విచారించాలని కోరుతూ పిటిషన్‌ వేయనున్నట్లు పులి సత్యం చెప్పారు. రాజన్నపై అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, రాజన్న ఆరోగ్యం కూడా బాగా లేదని బుర్రా రాములు చెప్పారు. రాజన్న హృద్రోగి అని, ఆయన బైపాస్‌ సర్జరీ జరిగిందని, అలాగే మోకాలు నొప్పులు కూడా వున్నాయని, రాజన్న బిపి పేషెంట్‌ కూడా అని, ఈ స్థితిలో పోలీసులు రాజన్నను తమ కస్టడీలోకి తీసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X