• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యవసాయానికి ఏడు గంటలు కరెంట్‌: షబ్బీర్‌

By Staff
|

హైదరాబాద్‌: వ్యవసాయానికి రోజుకు ఏడు గంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార పౌర సంబంధాల మంత్రి షబ్బీర్‌ అలీ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అసవరమైన చోట్ల ఎక్కువ విద్యుత్‌ను అందించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. పరిశ్రమలకు కోత విధించి అయినా సరే రోజుకు ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి హోదా కల్పించాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వరద తాకిడి ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలపై కూడా మంత్రివర్గం చర్చించింది. ఆలాగే వర్షాభావ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వివాదంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. నూతన పర్యాటక విధానానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X