• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యుయస్‌ ఓపెన్‌: డబుల్స్‌లో పేస్‌ జోడీ విజయం

By Staff
|

న్యూయార్క్‌: యుయస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌, మార్టిన్‌ డామ్‌ జోడీ విజయ కేతనం ఎగురవేసింది. ఈ జోడీ రెండో సీడ్స్‌ జోనస్‌ జోర్కమాన్‌, మాక్స్‌ మిమ్యీ జోడినీ 6-7, 6-4, 6-3 స్కోర్‌తో ఓడించింది. ఆరో సీడ్స్‌గా బరిలోకి దిగిన భారత, చెక్‌ జోడీ సెకండ్‌ సెట్‌లో బ్రేక్‌ డవున్‌ను ఎదుర్కున్నప్పటికీ రెండు గంటలా 35 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో విజయం సాధించింది.

డామ్‌తో తనకు గల కమ్యూనికేషన్‌ తమ విజయంలో కీలక పాత్ర పోషించిందని పేస్‌ అన్నాడు. మార్టిన్‌తో కలిసి ఆడడం ఎంత ఆనందంగా వుందో, తాను ఎంతగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించిందో పదాల్లో చెప్పలేనని ఆయన అన్నాడు. మార్టిన్‌ బలమైన ఆటగాడని ఆయన కొనియాడాడు. మార్టిన్‌తో ఆడడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X