• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు భద్రత కుదింపులో ఉద్దేశాలు లేవు: జానా

By Staff
|

నల్లగొండ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు కావాలని భద్రత కుదించలేదని హోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టం చేశారు. భద్రతను సమీక్షించేందుకు ఒక కమిటీ వుంటుందని, ఆ కమిటీ సూచనల మేరకే చర్యలు తీసుకుంటామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబుకు భద్రత కుదించడంలో పక్షపాతంతో వ్యవహరించారనే విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు.

తాము భద్రతకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నామని, పరిస్థితులను బట్టి భద్రతను సమకూర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ నేత చంద్రబాబునాయుడుకు ప్రభుత్వం భద్రతను కుదించిందని తెలుగు యువత అధ్యక్షుడు తలసాని శ్రీనివాస యాదవ్‌ విమర్శించారు. చంద్రబాబు భద్రత కుదింపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోమవారంనాడు హైదరాబాద్‌లోని డిజిపి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X