వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ర్యాంక్ తగ్గడంపై బెంగ లేదు: సానియా మీర్జా
ముంబాయి: తన ర్యాంక్ తగ్గడంపై తనకేమీ బెంగ లేదని హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా అంది. ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలుచుకోకుండానే తన కెరీర్ ముగిసిపోవచ్చునని ఆమె అన్నది. యుయస్ ఓపెన్లో పాల్గొని వచ్చిన సానియా మీర్జా శుక్రవారం ముంబాయిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడింది. తన భవిష్యత్తుపై తనకేమీ బెంగ లేదని ఆమె అన్నది.
తనకింకా భవిష్యత్తు ఉందని ఆమె అన్నది. ప్రతి ఏడాది తాను అదే ఆటతీరును ప్రదర్శిస్తున్నానని ఆమె చెప్పింది. తన లోపాలు ప్రత్యర్థులకు తెలిసిపోతున్నాయనే వ్యాఖ్యలను ఆమె కొట్టిపారేశారు. తన ర్యాంక్ తగ్గడంపై కంగారు పడాల్సిందేమీ లేదని ఆమె అన్నది. డబ్ల్యుటిఎ ర్యాంకింగ్లో సానియా మీర్జా స్థానం 70కి పడిపోయింది.
Comments
Story first published: Friday, September 15, 2006, 23:53 [IST]