• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ వీరు స్థూపం పెట్టాలి: నరేంద్ర

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాన సాయుధ పోరాట అమరవీరుల స్థూపాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత ఎ. నరేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివారంనాడు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను, పార్టీ పతాకను ఎగురవేశారు. అనంతరం ఆయన నాయకత్వంలో తెరాస నాయకులు గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుండగా మన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

తెలంగాన విమోచనోత్సవం సందర్భంగా బిజెపి నాయకులు సర్దార్‌ వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఎంత ఖచ్చితమో, హైదరాబాద్‌ అందులో అంతర్భాగం కావడం అంత ఖచ్చితమని ఈ సందర్భంగా బిజెపి నాయకులు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయం ఎన్టీ ఆర్‌ ట్రస్టు భవన్‌లో నిర్వహించింది. తెలంగాణలో పటేలు, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిజాం నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పాలనా కాలంలో తెలంగాణ అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని పార్టీ సీనియర్‌ నేత చెన్నమనేని రాజేశ్వరరావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X