• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కలెక్టర్‌ను అవమానించిన కరణంపై కేసు

By Staff
|

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కరణం బలరాం ప్రవర్తనను మనసును బాధపెట్టిందని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఉదయలక్ష్మి అన్నారు. బలరాం మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటికి సంబంధించి కరణం బలరామ్‌కు, ఉదయలక్ష్మి మధ్య ఆదివారం వాగ్వివాదం చెలరేగింది. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు మీరే అడ్డంకి అని, ఏదైనా పని చేసేటప్పుడు సిగ్గుండాలి అని కరణం బలరామ్‌ అన్నారు. అయితే బలరాం ఆ మాటలను కలెక్టర్‌ను ఉద్దేశించి అనలేదని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం హైదరాబాద్‌లో వివరణ ఇచ్చారు. రైతుల సమస్యలను లేవనెత్తినందుకే బలరామ్‌ను కలెక్టర్‌ ఉదయలక్ష్మి అవమానించారిన వారన్నారు.

కలెక్టర్‌ను దూషించినందుకు బలరామ్‌పై మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనపై వెలిగోడు ఎస్‌ఇ, సిఇలు మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. కరణం బలరామ్‌ కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఉదయలక్ష్మిని తెలుగుదేశం శాసనసభ్యుడు అవమానించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. కరణం బలరామ్‌ను వెంటనే అరెస్టు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. కరణం బలరామ్‌ వ్యవహారశైలిని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more