• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దాడులు చేస్తే, ప్రతిదాడులు తప్పవు: నెహ్రూ

By Staff
|
విజయవాడ: దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని కాంగ్రెస్‌ విజయవాడ శాసససభ్యుడు దేవినేని నెహ్రూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కావాలని తమ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై దాడి చేయించిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు సర్వే సత్యనారాయణ, లగడపాటి రాజగోపాల్‌ల మధ్య వివాదం తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, దీనితో తెరాసకు సంబంధం ఏమిటని ఆయన అన్నారు. తెరాస ఉద్యమం చేసుకోవచ్చునని, కానీ ఇటువంటి దాడులకు పాల్పడడం సరి కాదని ఆయన అన్నారు. ఇలాంటి దాడులు జరిగితే సహించబోమని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని తాము తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి వదిలివేశామని, అది ఇప్పుడు అంశం కాదని ఆయన అన్నారు.

తనపై జరిగిన దాడికి లగడపాటి రాజగోపాల్‌ ఏ కార్యక్రమం చేపట్టినా తమ మద్దతు ఉంటుందని విజయవాడకు చెందిన మరో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఈ దాడి వెనుక సర్వే సత్యనారాయణ హస్తం వుండవచ్చునని ఆయన అన్నారు. సర్వే సత్యనారాయణపై తమ పార్టీ అధిష్ఠానవర్గానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఇద్దరు ఎంపీల మధ్య వివాదాన్ని ఆసరాగా తీసుకుని రెచ్చగొట్టడం తగదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు హైదరాబాద్‌ ఏం కావాలనేది మాత్రమే చర్చనీయాంశమవుతుందని, ఇప్పుడే హైదరాబాద్‌ మాదని చెప్పుకోవడం సరి కాదని ఆయన అన్నారు. రాజగోపాల్‌పై దాడి దురదృష్టకరమని గుంటూరు కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం శాంతియుతంగా ఉద్యమం నడుపుకోవచ్చునని, కానీ ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తమ పార్టీ రెండో ఎస్సార్సీకి కట్టుబడి వుందని ఆయన చెప్పారు. లగడపాటిపై దాడికి నిరసనగా విజయవాడలో ఆందోళన మొదలైంది. ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more