• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ కోసం గ్రూప్‌ కడదాం, రండి: సర్వే

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గ్రూప్‌ కడదాం రండంటూ కాంగ్రెస్‌ సిద్ధిపేట పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి బాగానే పని చేస్తున్నారంటూనే ఎన్నాళ్లి ఉందాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం రండంటూ ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను కోరారు. లగడపాటి రాజగోపాల్‌ వ్రవర్తన ఇలాగే ఉంటూ చూస్తూ ఊరుకోబోమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ బలాలు పరస్పరం ఆధారపడి వున్నాయని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరాలని ఆయన తెరాస నాయకులను కోరారు. రాజగోపాల్‌ వ్యాపారంలో డబ్బులు సంపాదించడంలో తన కన్నా ముందు ఉండవచ్చు గానీ రాజగోపాల్‌కు తనకన్నా రాజకీయానుభవం తక్కువని, తన కన్నా చదువుకున్నాడని, కార్యకర్తలను, ప్రజలను రెచ్చగొట్టవద్దని తాను చెప్పానని ఆయన అన్నారు. తమ పార్టీ నేత సోనియా గాంధీని, పార్టీని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడవద్దని ఆయన రాజగోపాల్‌కు సలహా ఇచ్చారు. వైయస్‌ పాలన బాగున్నా కొన్ని అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X