వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిట్నెస్‌ మీద ఆధారపడలేను: సానియా

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: తాను ఎప్పుడు కూడా ఫిట్‌ ప్లేయర్‌ను కానని, తాను ఫిట్నెస్‌ మీద ఆధారపడడం లేదని, తాను తన స్ట్రోక్‌ ప్లే మీద ఆధారపడాల్సిందేనని హైదరాబాద్‌ టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా అన్నారు. విదేశాల్లో తానెప్పుడూ ఫిట్‌ ప్లేయర్‌ను కానని తనకు తెలుసునని, దాని వల్ల మార్టిన్‌ హింగిస్‌ మాదిరిగా తన ప్రత్యర్థి అలసిపోయేంత వరకు నిరీక్షించలేనని ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గతంలో కన్నా సహనంతో వ్యవహరిస్తున్నప్పటికీ స్ట్రోక్స్‌ ఆటనే కొనసాగించాలనే విషయం తనకు తెలుసునని ఆయన చెప్పారు.

రెండేళ్ల ఆటలో తాను చాలా పరిణతి చెందానని ఆమె చెప్పారు. ఒత్తిడిలో ఆడడం నేర్చుకున్నానని, ప్రస్తుతం తాను ఒత్తిడిని తట్టుకోవడమే కాకుండా ఆనందించడం ప్రారంభించానని, ఈ విషయంలో తన వైఖరిని మార్చుకున్నానని ఆమె అన్నారు. తాను ముందే చెప్పినట్లు కొన్నేళ్లు బాగా నడుస్తాయి, కొన్నేళ్లు బాగుండవని ఆమె అన్నారు. డబుల్స్‌లో తన ఆటతీరు చెడుగా ఏమీ లేదని, నేను వ్యక్తిగా పెరిగాననని, తెలివి కూడా సంతరించుకున్నానని ఆమె అన్నారు. టెన్నిస్‌లో రిటైర్‌మెంట్‌ వరకు నేర్చుకోవడమే ఉంటుందని, తాను ప్రతి రోజు నేర్చుకుంటూనే వున్నానని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X