వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌: బలపరీక్షలో నెగ్గిన మధు కొడా

By Staff
|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్‌లోని మధు కొడా నేతృత్వంలో ఏర్పడిన యుపిఎ ప్రభుత్వం బుధవారంనాడు బలపరీక్షలో నెగ్గింది. ప్రతిపక్ష యన్‌డిఎ శాసనసభను బహిష్కరించింది. అధికార పక్షానికి మద్దతుగా 41 ఓట్లు వచ్చాయి. సిపిఐ - యంయల్‌ సభ్యుడు వినోద్‌ సింగ్‌ మధు కొడా ప్రభుత్వం ప్రతిపాదించిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేశారు.

మధు కొడా బుధవారం శాసనసభలో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన వెంటనే ముందు స్పీకర్‌ నియామకం జరగాలని యన్‌డిఎ సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే వారి డిమాండ్‌కు అంగీకరించలేదు. దీంతో వారంతా సభ నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 18వ తేదీన స్వతంత్ర శాసనసభ్యుడు మధు కొడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 25వ తేదీ లోగా శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ సయ్యద సిబ్తీ ఆదేశించారు. ఈ నెల 14వ తేదీన అర్జున్‌ ముండా నేతృత్వంలోని యన్‌డిఎ ప్రభుత్వం కుప్పకూలింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X