• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆస్తి వుంటే హుండీలో వేయండి: కరుణాకర్‌

By Staff
|

తిరుపతి: తనకు మూడు కోట్ల రూపాయల ఆస్తి వుంటే తాను తెలుగుదేశం పార్టీవారికి ఇచ్చేందుకు సిద్ధంగా వున్నానని, దాన్ని వెంకటేశ్వరుడి హుండీలో వేస్తే మంచిదని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్‌ పి. కరుణాకర్‌ రెడ్డి అన్నారు. తనకు మూడు కోట్ల రూపాయల ఆస్తులున్నాయని రుజువు చేస్తే ఇల్లు విడిచి వెళ్లిపోతానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై చేసిన విమర్శలను ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు.

తాను హేతువాదినని, విప్లవోద్యమంలో పాల్గొన్నానని తెలుగుదేశం నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను కమ్యూనిస్టుగా ఉన్న మాట వాస్తవమేనని, అయితే తాను భగవంతుడికి వ్యతిరేకంగా ఎక్కడా ప్రచారం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇతరులు వేలెత్తి చూపే దుస్థితిని తాను తెచ్చుకోనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X