వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐజి ఆర్‌పి మీనా వీరంగం: పోటెత్తిన నిరసన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తూనికలు, కొలతల శాఖ కమీషనర్‌, ఐజి ఆర్‌పి మీనా గురువారం తన కార్యాలయం సిబ్బందిపైనా, మీడియాపైనా తన ప్రతాపం చూపించారు. డిప్యూటీ కంప్ట్రోలర్‌ విమల్‌బాబు లైంగిక వేధింపులకు నిరసనగా కార్యాలయం సిబ్బంది తలపెట్టిన ధర్నాకు ఆయన ఆగ్రహం చెందారు. ధర్నాకు ఏర్పాట్లు చేసుకుంటున్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మైక్‌ సెట్‌ను పీకి పారేయించారు. దీన్ని చిత్రీకరిస్తున్న ఈనాడు దినపత్రిక ఫొటోగ్రాఫర్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఫొటోగ్రాఫర్‌ కెమెరాను లాక్కుని, రీలు పీకేసి, కెమెరాను నేలకేసి కొట్టాడు. అంతేకాకుండా ఫొటోగ్రాఫర్‌పై చేయి చేసుకున్నారు.

మీనా దురుసు ప్రవర్తనకు వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ముషీరాబాద్‌ వద్ద తూనికలు, కొలతల కార్యాలయం నుంచి ప్రదర్శన నిర్వహించి ఆర్టీసి క్రాస్‌ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. వీరికి మద్దతుగా పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విమల్‌ బాబు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఉద్యోగులు రెండు నెలల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విమల్‌బాబుపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు గురువారం ధర్నా తలపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X