• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాడెన్‌ మరణించాడు: ఫ్రెంచ్‌ పత్రిక కథనం

By Staff
|

పారిస్‌: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ టైఫాయిడ్‌తో నెలరోజుల క్రితం పాకిస్ధాన్‌లో మృతి చెందినట్టు ఒక ఫ్రెంచి పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ సమాచారాన్ని సౌదీ అరేబియా కూడా విశ్వసిస్తోంది కానీ అమెరికా మాత్రం ధృవపరచడం లేదు. లాడెన్‌ మరణ సమాచారాన్ని ఫ్రెంచి గూఢచార సంస్ధ సేకరించినట్టు ఫ్రెంచ్‌ వార్తా పత్రిక లియెస్ట్‌ రిపబ్లికన్‌ ప్రచురించింది. ఈ సమాచారాన్ని ఆ గూఢచార సంస్ధ ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడికి, ప్రధానికి చేరవేసినట్టు ఆ పత్రిక రాసింది. టైఫాయిడ్‌తో లాడెన్‌ గత నెల 23న మరణించినట్టు సౌదీ ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది. లాడెన్‌ మరణించాడన్న విషయం తమ దృష్టికి రాలేదని పాకిస్ధాన్‌ అంతర్గత భద్రత శాఖ సీనియర్‌ అధికారి చెప్పారు. పాక్‌- ఆఫ్ఘన్‌ సరిహద్దులోని కొండల్లో తలదాచుకున్న లాడెన్‌ అక్కడే మరణించాడని తాజా సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X