వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియాపై హింగిస్‌ విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత: ఇక్కడ జరుగుతున్న సన్‌ఫీస్ట్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్‌లో ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ మార్టినా హింగిస్‌ ముందు భారత ఆశాజ్యోతి సానియా మీర్జా ఎటువంటి సంచలనాలనూ సాధించలేకపోయింది. అయితే ఈ పోటీలో ఆద్యంతం పోరాడి ఓడిన సానియా మీర్జా తన ప్రత్యర్థి హింగిస్‌ నుంచి మంచి ఆటతీరుకూ, పోరాటపటిమకూ ప్రశంసలు మాత్రం అందుకుంది. శనివారం కోల్‌కతాలో జరిగిన సెమీఫైనల్‌లో మార్టిన్‌ హింగిస్‌ చేతిలో సానియా 1-6, 0-6 తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. స్కోరు బట్టి సానియా మీర్జా పేలవమైన ఆటతీరు ప్రదర్శించిదనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రతి పాయింట్‌లో సానియా గట్టి పోటీ ఇచ్చినా.. ప్రత్యర్థి చేసిన తప్పిదాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో సానియా విఫలమై మ్యాచ్‌ను చేజేతులా వదులుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌ అనంతరం హింగిస్‌ మాట్లాడుతూ సానియా ఆటతీరును చూసి ముచ్చటపడినట్టు చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X