వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టార్‌ పరిశీలనలో తెలుగు ఛానెల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇంతవరకూ ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ప్రసారాలకే పరిమితమైన స్టార్‌ టెలివిజన్‌ గ్రూపు త్వరలోనే తెలుగులో టీవీ ఛానల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రూపర్ట్‌ ముర్దోక్‌ సారథ్యంలోని స్టార్‌ టెలివిజన్‌ గ్రూప్‌ తమిళనాట విజయ్‌ టీవీలో వాటాలు కొనుగోలు చేసి తమిళ టెలివిజన్‌ రంగంలో అడుగుపెట్టింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లో బెంగాలీ ఛానల్‌ను సైతం ప్రారంభించింది. అదేవిధంగా తెలుగులో కూడా రంగప్రవేశం చేయాలన్న ఆలోచన చేస్తోంది. వచ్చే సంవత్సరాంతానికి తెలుగులో పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ను ప్రారంభించే అవకాశం ఉందని స్టార్‌ గ్రూప్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యుటివ్‌ పీటర్‌ ముఖర్జీ హైదరాబాద్‌లో వెల్లడించారు. ఇంగ్లీష్‌, హిందీ ఛానళ్ల మధ్య జాతీయ స్థాయిలో పోటీ అధికంగా ఉంటున్నందున దీర్ఘకాలిక వ్యూహాలలో భాగంగా ప్రాంతీయ భాషలలో సైతం ప్రసారాలు ప్రారంభించాల్సిన అవసరాన్ని స్టార్‌ గ్రూప్‌ గుర్తించిందని ముఖర్చీ వివరించారు. ఈ దిశగా ప్రస్తుతం వివిధ అంశాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలోని ఎలక్ట్రానిక్‌ మీడియాలోకి యేటా అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా వస్తున్న రాబడి 12 వేల కోట్ల రూపాయలకు పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తాము కొత్త వ్యూహాలు రచిస్తున్నామని స్టార్‌ గ్రూప్‌ ఇండియా అధినేత వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X