• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భూకబ్జాపై వైయస్‌ సహా 75 మందిపై పిటిషన్‌

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు భూ వ్యవహారాలపై తెలుగుదేశం పార్టీ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి సహా కొంత మంది మంత్రులను, శాసనసభ్యులను, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను, ముఖ్యమంత్రి సమీప బంధువులను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. తెలుగుదేశం నాయకులు కడియం శ్రీహరి, నాగం జనార్దన్‌ రెడ్డి, తదితరుల తరఫున సీనియర్‌ న్యాయవాది రామచంద్రరావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వేయి పేజీల డాక్యుమెంటు ఆధారంగా తెలుగుదేశం పార్టీ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ రిజిస్ట్రార్లను, సబ్‌ రిజిష్ట్రార్లను కూడా పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. మొత్తం 75 మందిపై తెలుగుదేశం పార్టీ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఇదిలావుంటే, అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును సాకుగా తీసుకుని భూకబ్జాలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఈ భూకుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. హుడా చైర్మన్‌ చైర్మన్‌ సుధీర్‌ రెడ్డిపై కేసులు పెట్టాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. భూకబ్జాకు సహకరించిన హుడా ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేయాలని ఆయన కోరారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును సాకుగా తీసుకుని భూకుంభకోణానికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపియం సోమవారం హైదరాబాద్‌లో ప్రదర్శన నిర్వహించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X