వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌సి వర్గీకరణ కింద పదోన్నతులు చెల్లవు: సుప్రీం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: షెడ్యూల్డ్‌ కులాల (ఎస్‌సి) రిజర్వేషన్ల వర్గీకరణ కింద 2004 నవంబర్‌ 4వ తేదీ తర్వాత చేపట్టిన నియామకాలు, కల్పించిన పదోన్నతులు చెల్లనేరవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2004 నవంబర్‌ 4వ తేదీకి ముందు కల్పించిన పదోన్నతులు, జరిపిన నియామకాలు యధాతధంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ చెల్లనేరదని 2004 నవంబర్‌ 5వ తేదీన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ కింద జరిపిన నియామకాలను, కల్పించిన పదోన్నతులను ప్రశ్నిస్తూ మాల మహానాడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం ఆ ఆదేశాలు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X