• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిట్టింగ్‌ జడ్జి విచారణకు కారత్‌ డిమాండ్‌

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ అన్నారు. ప్రభుత్వం విచారణకు ముందుకు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తే న్యాయం జరగదని తాము భావిస్తున్నామని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపితేనే నిజాలు వెలుగు చూసే అవకాశం వుందని ఆయన అన్నారు.

రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే ప్రజలు నమ్మబోరని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. సిట్టింగ్‌ జడ్జితో రింగ్‌ రోడ్డు అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విచారణ విషయంలో పునరాలోచన చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యవహారాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినవారిపై, చేసుకున్నవారిపై చర్య తీసుకోవడానికి విచారణలేం అక్కర్లేదని, విచారణ లేకుండానే వారిపై చర్యలు తీసుకోవచ్చునని, ఇందుకు ప్రభుత్వం ముందుకు రావడం అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X