• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హనుమంత వాహనంపై శ్రీవారి ఊరేగింపు

By Staff
|

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మాత్సవాల్లో భాగంగా శనివారం ఆరో రోజున శ్రీవారు హనుంత వాహనంపై తిరుమాడ వీధులలో విహరించారు. త్రేతాయుగంలో శ్రీరాముడి నమ్మినబంటు హనుమంతుడు. సకలగుణ సంపన్నుడైన ఆంజనేయస్వామి శ్రీరాముడికి వీరభక్తుడు కావడాన్ని బట్టి రాముడు ఎంత గొప్పవాడో ఊహించుకోవచ్చు.

త్రేతాయుగపు రాముడు కలియుగంలో వెంకటేశ్వరస్వామిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. శనివారం హనుమంత వాహనంపై తిరువీధుల్లో విహరించిన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని భక్తులు తరించారు. రాత్రి గరుడసేవకు వచ్చిన వేలాది భక్తులు శనివారం కూడా ఇక్కడ ఉండిపోయి హనుమంత వాహనంపై ఊరేగిన దేవదేవుని దర్శించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X