వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంచల్‌గుడా జైలులో మోనికాబేడీ కుట్లు, అల్లికలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్టు కేసులో ఐదేళ్ళ శిక్ష పడిన సినీనటి మోనికా బేడీ నేడు చంచల్‌గుడాలో మహిళా ఖైదీల దుస్తుల్లో కన్పించింది. ఆమెను చంచల్‌గుడా జైలులో పరామర్శించడానికి ఆమె కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు. సాధారణంగా ఖైదీలు జైలు ఆవరణలో ఏదో ఒక ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది. తనకు కొవ్వొత్తులు చేయడం రాదని చెప్పిన మోనికాను అల్లికలు, కుట్లు నేర్చుకోవలసిందిగా జైలు అధికారులు ఆదేశించారు.

సినిమా నటి అయినంత మాత్రాన జైలులో ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఉండదని, జైలులో ఉన్న వందలాది ఖైదీలలో ఒకరిగా ఆమెను పరిగణిస్తామని చంచల్‌గుడా జైలు మహిళా విభాగం సూపరింటెండెంట్‌ శారద శనివారం ఇక్కడ చెప్పారు. మోనిక చంచల్‌గుడ జైలులో ఖైదీ నెం 103గా శఖ అనుభవిస్తున్నారు. నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికా బేడికి సిబిఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన విషయంతెలిసిందే. మోనికా బేడీ నకిలీ పాస్‌పోర్టు పొందడంలో సహకారం పొందేందుకు సహకరించారనే ఆరోపణపై శిక్ష పడిన అబ్దుల్‌ సత్తార్‌, యూనిస్‌, గోకరీలకు బెయిల్‌ లభించింది. పైకోర్టుకు వెళ్లేందుకు వారికి బెయిల్‌ లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X